బైక్‎ను ఢీకొన్న డీసీఎం వాహనం..ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

ABN , First Publish Date - 2021-03-21T13:08:14+05:30 IST

ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ ..

బైక్‎ను ఢీకొన్న డీసీఎం వాహనం..ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

ములుగు: ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనం బైక్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన పందికుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధులకు నర్సంపేట డిపోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Updated Date - 2021-03-21T13:08:14+05:30 IST