బీజేపీని గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలి

ABN , First Publish Date - 2021-02-27T04:35:31+05:30 IST

బీజేపీని గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలి

బీజేపీని గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలి
సమావేశంలో మాట్లాడుతున్న విక్రంరెడ్డి

బీజేపీ జిల్లా రూరల్‌ అధ్యక్షుడు విక్రంరెడ్డి

ఘట్‌కేసర్‌: బీజేపీని గ్రామస్థాయిలో మరిం త పటిష్టప ర్చేందుకు కార్యకర్తలు శ్రమించాలని ఆపార్టీ జిల్లారూరల్‌ అఽధ్యక్షుడు పి.విక్రంరెడ్డి అ న్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని శివారెడ్డి గూడబంధన్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మండ ల అధ్యక్షుడు ప్రవీణ్‌రావు అధ్యక్షతన నిర్వహిం చిన బీజేపీ మండల సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ అవి నీతిపై కార్యకర్తలు ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ప్రజలకు అండగా ఉండాలన్నా రు. అనంతరం మండల పార్టీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని, అనుబంధ కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ది మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి, భోభారాణి, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:35:31+05:30 IST