‘భగీరథ’ గుంతలతో తిప్పలు

ABN , First Publish Date - 2021-05-20T05:37:01+05:30 IST

‘భగీరథ’ గుంతలతో తిప్పలు

‘భగీరథ’ గుంతలతో తిప్పలు
మిషన్‌ భగీరథ నల్లాకు తీసిన గుంత

కందుకూరు: మండలంలోని కొత్తూరు గ్రామంలో మిషన్‌ భగీరథ నల్లాకనెక్షన్ల కోసం తీసిన గుంతలను పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. మార్చి 23న ఇళ్ల ముందు గుంతలను తీసి ఎలాంటి కనెక్షన్లు ఇవ్వకుండా 60ఇళ్ల వద్ద పైపులను భూమిపైకి వదిలివేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయైు సర్పంచ్‌ పల్లె వసంత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పైపులైన్‌ వేసిన కాంట్రాక్టర్‌  పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గుంతలను పూడ్చాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-05-20T05:37:01+05:30 IST