కరోనాపై నేడు మంత్రి సమీక్ష

ABN , First Publish Date - 2021-05-20T06:32:16+05:30 IST

రాష్ట్రశాషన సభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యశాఖ అధికారులతో కరోనాపై సమీక్షించనున్నారు. గురువారం ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి

కరోనాపై నేడు మంత్రి సమీక్ష

నిజామాబాద్‌అర్బన్‌, మే 19: రాష్ట్రశాషన సభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యశాఖ అధికారులతో కరోనాపై సమీక్షించనున్నారు. గురువారం ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10గంటలకు కామారెడ్డి జిల్లాకేంద్రానికి మంత్రి చేరుకుంటారు. అనంతరం కామారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులతో కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. 

Updated Date - 2021-05-20T06:32:16+05:30 IST