మద్యం దుకాణంలో వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2021-11-21T06:12:14+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకా ణంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూత న్‌కల్‌ మండలం దిర్శినపల్లికి చెందిన ధనావత్‌ శ్రీనునాయక్‌(35) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చా డు. పని ముగిసిన అనంతరం జిల్లా కేంద్రంలోని మెయిన్‌

మద్యం దుకాణంలో వ్యక్తి హత్య

సూర్యాపేటక్రైం, నవంబరు 20: జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకా ణంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూత న్‌కల్‌ మండలం దిర్శినపల్లికి చెందిన ధనావత్‌ శ్రీనునాయక్‌(35) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చా డు. పని ముగిసిన అనంతరం జిల్లా కేంద్రంలోని మెయిన్‌ రోడ్డులో గల ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించాడు.  ఆ సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న మరో వ్యక్తితో  స్వల్ప వివాదం జరిగింది. సమయం దాటి పోవ డంతో మద్యం దుకాణాన్ని బంద్‌ చేశారు. శ్రీనునాయక్‌తో పాటు వివాదం పెట్టుకున్న వ్యక్తి ఒక ఆటోను అద్దెకు మాట్లాడుకుని మద్యం సేవించేందుకు అక్కడి నుంచి అర్ధరాత్రి ఖమ్మం రోడ్డులో ఉన్న శివాని వైన్స్‌ వద్దకు వెళ్లారు. అక్కడ అప్పటికే మద్యం దుకాణం బంద్‌ చేసి ఉంది. వైన్స్‌ పక్కన గల పర్మి ట్‌ రూంలో నిద్రించే వ్యక్తిని గేటు తీయాలని కోరారు. శ్రీనునాయక్‌తో పాటు ఆటోలో వెళ్లిన మరో వ్యక్తి లోపలికి వెళ్లారు. అక్కడ శ్రీనునాయక్‌ను పట్ట  ణానికి చెందిన మరో వ్యక్తి గాజు సీసాతో తలపై మోది, అక్కడి దొరికిన వాటితో శ్రీనునాయక్‌ను హత్య చేశాడు. ఈ విషయాన్ని పర్మిట్‌ రూంలో నిద్రిం చిన వ్యక్తి మద్యం దుకాణం యజమా నులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పట్టణ పోలీసులకు విషయం ఇవ్వడం తో డీఎస్పీ ఎస్‌.మోహన్‌కుమార్‌, పట్ట ణ ఇన్స్‌పెక్టర్‌ అరకపల్లి ఆంజనేయులు, పట్టణ ఎస్‌ఐ బాసునాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.హత్యకు మద్యం సేవించే సమయంలో జరిగిన వివాదం తో మద్యం మత్తులో హత్యకు పాల్ప డినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీను నాయక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు మద్యం దుకాణం వద్దకు చేరుకుని హత్యకు గల కారణాలు తెలపాలని ఆందోళన చేశారు. 

Updated Date - 2021-11-21T06:12:14+05:30 IST