లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-31T06:14:18+05:30 IST
బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.
భువనగిరి రూరల్, డిసెంబరు 30 : బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన ఎర్రోళ్ల యాదగిరి(55) వ్యక్తిగత పనినిమిత్తం బైక్‌పై భువనగిరి వస్తున్నాడు. అదేమార్గంలో అనంతారం గ్రామం వద్ద బైక్ వెనక నుంచి అతివేగంగా వస్తూ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం స్థానికులు 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. యాదగిరి భార్య గండమ్మ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ చాకలి శ్రీనివా్‌సపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ తెలిపారు.