కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం : చందర్‌

ABN , First Publish Date - 2021-03-24T06:24:45+05:30 IST

సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని హాలియా మునిసిపాలిటీ ఇన్‌చార్జి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.

కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం : చందర్‌
హాలియా : సమావేశంలో మాట్లాడుతున్న చందర్‌

హాలియా, మార్చి 23 : సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని హాలియా మునిసిపాలిటీ ఇన్‌చార్జి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రభుత్వ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.    రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే నోము ల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, సమన్వయకర్త మలిగిరెడ్డి లింగారెడ్డి, చైర్మన్‌ వెంపటి పార్వతమ్మ, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, కౌన్సిలర్లు వెంకటయ్య, శ్రీనివాస్‌, వర్రా వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్‌, రామగుండం నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌, డిప్యూటీ మే యర్‌ అభిషేకరావు, కార్పొరేటర్లు రాజేష్‌, కుమ్మరి శ్రీనివాస్‌, భాస్కర్‌, రాజేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
తిరుమలగిరి(సాగర్‌) :
రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్‌ పలు పథకాలను అమలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రమావత్‌ రవీంద్రకుమార్‌, జా జుల సురేందర్‌ అన్నారు. మంగళవారం వారు మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలి సి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.
సాగర్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
నాగార్జునసాగర్‌ / హాలియా :
సాగర్‌ అభివృద్ధి టీఆర్‌ఎ్‌సతోనే సా ధ్యమని సాగర్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ రామకృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన సాగర్‌ హిల్‌కాలనీలో 6,12 వార్డుల్లో కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి  ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు ప్ర భుత్వ సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించా రు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మరెడ్డి, ఇమ్రాన్‌, విక్రం, మోహన్‌నాయక్‌, కిషన్‌, సురేష్‌, రవి పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్‌ది విడదీయరాని బంధం : బాల్క సుమన్‌
పెద్దవూర, మార్చి 23 :
తెలంగాణ రాష్ట్ర సాధన కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర్ట్రం సాధించుకునే వరకు ఉద్యోగ సంఘాలు, టీఆర్‌ఎస్‌ పార్టీది విడదీయరాని బంధం ఉందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. పీఆర్‌సీ ప్రకటనలతో మండల కేంద్రంలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో  30శాతం పీఆర్‌సీ ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల పోరాటం ఎనలేనిదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.30లక్షల ఉద్యోగాలు కల్పించామని, రానున్న రోజుల్లో అదనంగా 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తుందన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో చేసేందేమీ లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ సలహాదారుడు సుందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుంటుక వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గోన విష్ణువర్దన్‌రావు, మంచిర్యాల, కరీంనగర్‌ గ్రంథాలయ ఛైర్మన్‌లు  ప్రవీణ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తాయి
మాడ్గులపల్లి :
ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తాయని ఆర్మూ ర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గారెకుంటపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని,  ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఆయన వెంట సర్పంచ్‌ జొన్నలగడ్డ విజయ, ఎంపీటీసీ మసిముక్కుల రజిత,  వెంకన్న, సైదులు పాల్గొన్నారు.
గడప గడపకు సంక్షేమ పథకాలు : భూపాల్‌రెడ్డి
గుర్రంపోడు : టీఆర్‌ఎస్‌ పాలనలో గడగడపకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని  ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.  మండలంలోని లక్ష్మిదేవిగూడెం, కోయగూరోనిబావి, కొప్పోల్‌, బుడ్డరెడ్డిగూడెం, బొల్లా రం, నడికుడ, ఆ మలూరు తదితర గ్రామాల్లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఆత్మీయ కు టుంబ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.

Updated Date - 2021-03-24T06:24:45+05:30 IST