జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శనీయం
ABN , First Publish Date - 2021-04-06T06:23:26+05:30 IST
సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడిన యోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని, ఆయన జీవి తం నేటితరానికి ఆదర్శనీయమని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు.
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పోరాడిన యోధుడు బాబూ జగ్జీవన్‌రామ్ అని, ఆయన జీవి తం నేటితరానికి ఆదర్శనీయమని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. సోమవారం భువనగిరిలో జరిగిన బాబూజగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో వారు మాట్లాడారు. మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ముందుగా ఆయన విగ్రహా నికి పూలమా లలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమాల్లో నాయకులు పోత్నక్ ప్రమోద్‌కు మార్, ఈరపాక నర్సింహా, పంగరెక్కల స్వామి, పడిగెల రేణుకా ప్రదీప్, బర్రె జహాంగీర్, బట్టు రాంచంద్రయ్య, కోళ్ల భిక్షపతి, డాక్టర్ బర్రె ప్రమీల, తదితరులు పాల్గొన్నారు. రామన్నపేటలో తహసీల్దార్ పి.ఆంజనేయులు, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోదాసు శిరీషపృథ్వీరాజ్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జలంధర్‌రెడ్డి, వెల్లంకిలో ఎడ్ల మహేందర్‌రెడ్డి, జనపంల్లి రేఖ యాదయ్య జగ్జీవన్‌రామ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మోత్కూరులో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ మందుల సామేల్, కల్వల ప్రకాష్‌రా యుడు, బుర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. గుండాల, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొ మ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, ఆత్మకూరు(ఎం), రాజాపేట, ఆలేరు, బీబీనగర్, వలిగొండ, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాసం ఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.