ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-09T06:41:34+05:30 IST

మండలంలోని లింగరాజుపల్లి గ్రా మంలో ఇంజమూరి సునీల్‌ (17) అనే విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య
సునీల్‌ (ఫైల్‌)

ఆత్మకూరు(ఎం), డిసెంబరు 8: మండలంలోని లింగరాజుపల్లి గ్రా మంలో ఇంజమూరి సునీల్‌ (17) అనే విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..... ఇంజమూరి సునీల్‌ నల్లగొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రె డ్డి మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం చదువుతున్నాడు. సునీల్‌ మంగళవారం లింగరాజ్‌పల్లికి వచ్చాడు. బుధవారం తన తాత సాయిలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చిన మృతుని బాబాయి శ్రీకాంత ఇంటి తలుపులు తీసిచూడగా సునీల్‌ ఫ్యాన కు వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతను చనిపోయాడు. సునీల్‌ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2021-12-09T06:41:34+05:30 IST