మారయ్యకు అంతిమ వీడ్కోలు
ABN , First Publish Date - 2021-12-19T05:41:05+05:30 IST
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య(73)కు శనివారం అంతిమ వీడ్కోలు పలికారు. నల్లగొండ పట్టణంలోని కనకదుర్గకాలనీలో ఉన్న మారయ్య స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
నివాళులర్పించిన మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య(73)కు శనివారం అంతిమ వీడ్కోలు పలికారు. నల్లగొండ పట్టణంలోని కనకదుర్గకాలనీలో ఉన్న మారయ్య స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. మారయ్య మృతికి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తంచేసి భౌతికకాయన్ని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మారయ్య మృతికి సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వెనుక ఉన్న జూబ్లీహిల్స్ శ్మశానవాటికలో క్రైస్తవ మతాచారం ప్రకారం మారయ్య అంత్యక్రియలు నిర్వహించారు.