నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2కోట్ల ఎసిడిపి నిధులు

ABN , First Publish Date - 2021-07-08T19:57:21+05:30 IST

జంటనగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అనేక నేరాలను నియంత్రించే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు

నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.2కోట్ల ఎసిడిపి నిధులు

హైదరాబాద్: జంటనగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అనేక నేరాలను నియంత్రించే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దీని కోసం అసెంబ్లీ నియోజక వర్గ అభివద్ధి ప్రోగ్రామ్ కింద రూ. 2కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు ఆయన తెలిపారు.  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్, నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డీపీసీ శ్రీనివాస్, పలువురు ఏసీపీ లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు తో అనేక నేరాలను నియంత్రణకు అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంఎల్ఏ లు, ఎంఎల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 2 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించడం జరుగుతుందని చెప్పారు. 


ప్రధాన కూడళ్ళు, జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలలో, అధికంగా నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలనిపోలీసు అధికారులను కోరిన మంత్రి నగరంలో ప్రస్తుతం 3.18 లక్షల సీఃసీ కెమెరాలు పని చేస్తున్నాయి. పలు కాలనీలు, బస్తీల వాసులు స్వచ్చందంగా ఏర్పాటు చేసుకున్న కెమెరాలు అదనంగా ఉన్నాయని తెలిపారు.బోనాలు, మొహరం, గణేష్ నవరాత్రుల సమయంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలు అన్ని పూర్తిస్థాయిలో పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-07-08T19:57:21+05:30 IST