వ్యాక్సిన్‌తోనే కొవిడ్‌ నుంచి భద్రత

ABN , First Publish Date - 2021-10-29T04:46:30+05:30 IST

వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి ఆరోగ్యానికి భద్రత లభిస్తుందని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. గురువారం రాయపోల్‌ మండలం అనాజీపూర్‌లో వ్యాక్సినేషన్‌ క్యాంపును, రాయపోల్‌, ఇందుప్రియాల్‌ పీహెచ్‌సీలను పరిశీలించారు.

వ్యాక్సిన్‌తోనే కొవిడ్‌ నుంచి భద్రత
రాయపోల్‌ మండలం అనాజీపూర్‌లో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో మనోహర్‌

  డీఎంహెచ్‌వో మనోహర్‌


రాయపోల్‌, అక్టోబరు 28: వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి ఆరోగ్యానికి భద్రత లభిస్తుందని డీఎంహెచ్‌వో మనోహర్‌ అన్నారు. గురువారం రాయపోల్‌ మండలం అనాజీపూర్‌లో వ్యాక్సినేషన్‌ క్యాంపును, రాయపోల్‌, ఇందుప్రియాల్‌ పీహెచ్‌సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 80 శాతానికి పైగా మొదటి డోస్‌, 47 శాతం రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని చెప్పారు. వందశాతం వ్యాక్సినేషన్‌కు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 


వ్యాక్సినేషన్‌కు సహకరించండి


సిద్దిపేట టౌన్‌: పట్టణంలో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌కు ముస్లింలు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి కోరారు. గురువారం పట్టణంలోని తంజీమ్‌ ఉల్‌ మసాజిద్‌ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌పై పట్టణ ముస్లిం, మైనారిటీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముస్లిం ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. మూడు కొవిడ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముస్లిం పెద్దలు కోరగా, వెంటనే ఏర్పాటు చేస్తామని కమిషనర్‌ చెప్పారు. 


వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు


మిరుదొడ్డి: కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలకు అపోహాలు వద్దని డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ సాయిలు, జిల్లా డైరెక్టర్‌ వెంకటయ్య, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, మౌనికరెడ్డి, ఎంపీడీవో రాజిరెడ్డి పాల్గొన్నారు.


వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలి


గజ్వేల్‌: మండలంలో రానున్న పది రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి, గజ్వేల్‌ నోడల్‌ అధికారి సరోజ అన్నారు. గురువారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో డాక్టర్‌లు గాయత్రి, ఆశ్లేష, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


వ్యాక్సిన్‌పై వైద్యాధికారి అవగాహన 


మద్దూరు: కరోనా వ్యాక్సిన్‌పై మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి రాజు మండల కేంద్రంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎస్‌ రాజయ్య, ఏఎన్‌ఎం జ్యోతి, సెక్రటరీ ప్రవీణ్‌, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-10-29T04:46:30+05:30 IST