విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన

ABN , First Publish Date - 2021-02-07T05:24:42+05:30 IST

ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.

విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యాబోధన
ఫర్నిచర్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

జిన్నారం, ఫిబ్రవరి 6 : ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం జిన్నారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఎమ్మెల్యే సొంత నిధులతో సమకూర్చిన ఫర్నిచర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ టూ పీజీలో భాగంగా అన్నివర్గాల వారికి గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని కోరారు. అనంతరం జంగంపేటలో వాలీబాల్‌ క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్స్‌ అందజేశారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని, జిన్నారంలో త్వరలోనే స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, సర్పంచులు లావణ్య, వెంకటయ్య, శివరాజ్‌, జనార్ధన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, మంద రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-07T05:24:42+05:30 IST