తుర్కపల్లిలో సిలిండర్‌ పేలి చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2021-10-28T05:30:00+05:30 IST

మండలంలోని తుర్కపల్లి తండాలో బుధవారం రాత్రి ఓ ఇంట్లో వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి.

తుర్కపల్లిలో సిలిండర్‌ పేలి చెలరేగిన మంటలు

 సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం 

నారాయణఖేడ్‌, అక్టోబరు 28:  మండలంలోని తుర్కపల్లి తండాలో బుధవారం రాత్రి ఓ ఇంట్లో  వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి తండాకు చెందిన శంకర్‌ ఇంట్లో రాత్రి ఒక్కసారిగా వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో  మంటలు పక్కనే ఉన్న నారాయణ ఇంటికి సైతం వ్యాపించి గృహాలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. రెండు గృహాల్లో కలిపి దాదాపు రూ.3లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST