ప్రతీ ధాన్యం గింజను కొంటాం

ABN , First Publish Date - 2021-05-22T05:29:52+05:30 IST

రైతులు పండించిన ప్రతి గిం జను కొనుగోలు చేస్తామని డీసీసీబీ డైరెక్టర్‌ మా మిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ ధాన్యం గింజను కొంటాం
పాన్‌గల్‌లో ధాన్యాన్ని పరిశీలిస్తున్న విండో చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి

పాన్‌గల్‌, మే 21 : రైతులు పండించిన ప్రతి గిం జను కొనుగోలు చేస్తామని డీసీసీబీ డైరెక్టర్‌ మా మిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ద వాజీపల్లి స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రంలో నిల్వ చేసిన ధాన్యాన్ని కొనుగోలు చే యడం లేదని రైతులు శుక్రవారం ప్రధాన రహ దారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న డీసీసీబీ డైరెక్టర్‌ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. వాహనాల ఇబ్బంది, స్థల స మస్య కారణంగా కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోం దని వివరించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ధా న్యం నిల్వ చేసేందుకు స్థలాలు ఎంపిక చేయడం చె ప్పారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా మని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విర మించారు. ఆయన వెంట ఎస్‌ఐ విజయభాస్కర్‌, ట్రై నీ ఎస్‌ఐ నాగరాజు ఉన్నారు.


రైతు వేదికల్లో ధాన్యం నిల్వలు

ఖిల్లాఘణపురం : ప్రభుత్వం నిర్మించిన రైతు వే దికల్లో వరి ధాన్యాన్ని నిల్వ చేయనున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ మురళీధర్‌రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ క్యామ రాజు తె లిపారు. శుక్రవారం వారు విలేకర్లత మాట్లాడుతూ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనల మేరకు రైతు వేదిక ల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గన్నీ బ్యాగుల కొరత ఉందని, లాక్‌డౌన్‌తో లారీలు రాక ఇబ్బంది ఉందని చెప్పారు. రైతు వేదికల్లో నిల్వ చేస్తున్న ధాన్యాన్ని ఈ సంద్భంగా వారు పరిశీలిం చారు.  కార్యక్రమంలో ఆర్మిక విభాగం జిల్లా అధ్యక్షు డు విక్రమ్‌, పీఏసీఎస్‌ సీఈవో ప్రకాష్‌ పాల్గొన్నారు.


రైతుల ఆందోళన

వరి ధాన్యం కొనుగోలు జాప్యంపై మండలంలోని మానాజీపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద శుక్రవా రం రైతులు ఆందోళన చేశారు. నెల రోజులైనా ధా న్యం కొనుగోలు చేయకపోవడంపై మండల మహిళా సమాఖ్య నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులకు సన్నిహితంగా ఉండే వారి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని. మిగిలిన వారి కొ నుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వక్తం చేవారు. ఈ విషయంపై సమాఖ్య లీడర్‌ను ప్రశ్నిస్తే ఎక్కువగా మాట్లాడొద్దని, అచ్యుతాపురం గ్రా మానికి ధాన్యాన్ని తీసుకెళ్లాలని నిర్లక్ష్యంగా సమాఽ దానం ఇస్తున్నట్లు రైతులు వాపోయారు.

Updated Date - 2021-05-22T05:29:52+05:30 IST