సమకాలీన పరిజ్ఞానం అవసరం

ABN , First Publish Date - 2021-10-26T04:52:06+05:30 IST

ప్రవేశ పరీక్షల్లో రాణించాలంటే సమయపాలన ఎంతో ముఖ్యమని కళాశాల విద్య సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు

సమకాలీన పరిజ్ఞానం అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న రాజేందర్‌సింగ్‌

- కళాశాల విద్య సంయుక్త సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌సింగ్‌

బాదేపల్లి, అక్టోబరు 25: ప్రవేశ పరీక్షల్లో రాణించాలంటే సమయపాలన ఎంతో ముఖ్యమని కళాశాల  విద్య సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్‌ పర్యవేక్షణలో భాగంగా ఆయన పరిశీలించారు.  ఈ సంద ర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు ఉత్తమ మార్కు లు సాధించడంతో పాటు భాషా, భావ వ్యక్తికరణ నైపుణ్యాలు పెంపొందించు కోవాలని సూచించారు. సానుకూల దృక్పథం విద్యార్థులకు ఎంతో ముఖ్య మన్నారు. నాణ్యామైన విద్యను నేర్చుకున్నప్పుడే భవిష్యత్తులో మంచి అవకాశా లు లభిస్తాయని అన్నారు. జడ్చర్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే గర్వ కారణంగా నిలవాలన్నారు. పీజీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో ఫిజిక్స్‌లో రెండవ ర్యాంక్‌ సాధించిన కుక్మినిని ఆయన అభినందించారు. అంతకు ముందు ఆయ నను విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అనంతరం బొటనికల్‌ గార్డెన్‌లో మొక్క నాటి నీరు పోశారు. గార్డెన్‌ సమన్వయ కర్తను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అప్పియా చిన్నమ్మ, అధ్యాపకులు శ్రీనివాసులు, రవీందర్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T04:52:06+05:30 IST