లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-21T06:26:36+05:30 IST

లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి : ఎస్పీ

లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలి : ఎస్పీ

ములుగు, మే 20: లాక్‌డౌన్‌ నిబంధనలను పటిష్టంగా అమలుచేయాలని  ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ పోలీసు అధికారులకు సూచించారు.  జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారంజరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా పట్ల ప్రజలు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండా లన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారికి ఈ-చలాన్‌ ద్వారా జరిమానాలు విధించాలని ఆదేశిం చారు. సాంకేతికతను ఉపయో గించుకొని సమగ్ర విచారణ జరపడం ద్వారా నేరస్థులకు శిక్షపడేవిధంగా కృషి చేయాలన్నారు. పీపీ, ఏపీపీ, దర్యాప్తు అధికారు లతో రివ్యూ కమిటీని ఏర్పాటుచేసి కోర్టులో నేరం రుజువు చేయడానికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకో వాలని తెలిపారు. ప్రతి ఆదివారం స్టేషన్లలో కోర్టు కానిస్టేబుల్‌ ద్వారా ఇతర సిబ్బందికి న్యాయస్థానాల్లో జరిగే సమగ్ర ప్రక్రియ, నేర రుజువుకు కావాల్సిన ఆధారాలను సేకరించే పద్ధతులపై శిక్షణ ఇప్పించా లని పేర్కొన్నారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బం దిని గుర్తించి రివా ర్డులు అందజేయాలన్నారు. పాత నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగ ట్టాల న్నారు. కొత్తగా నేరాలు చేయకుండా వారిని అదపు చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు రాజీపడొద్దని, వివిధ సమస్యలతో స్టేష న్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ నమ్మకాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్‌ నేరస్థులకు చిక్కకుండా అప్రమత్తం చేయాల న్నారు. సమావేశంలో ములుగు, ఏటూరునాగారం ఏఎ స్పీలు పి.సాయిచైతన్య, గౌస్‌ ఆలం, ఎస్‌బీ ఇన్‌ స్పెక్టర్‌ రెహమాన్‌, ములుగు, పస్రా, ఏటూరు నాగా రం సీఐలు జి.శ్రీధర్‌, ఎ.శ్రీనివాస్‌, కిరణ్‌, ఆర్‌ఐ స్వామి, డీసీఆర్‌బీ ఎస్సై చైతన్య చందర్‌ పాల్గొన్నారు.

పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎస్పీ

 ఐక్యరాజ్య సమితి ఆరో ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను గురు వారం ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పా టిల్‌ ఆవిష్కరించారు. ప్రజలంతా రోడ్డు భద్రతా నియమాలను పాటించి సురక్షితంగా ఉం డాల న్నారు. యంగ్‌ ఇండియా యూత్‌ సెక్యూర్డ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో రిజర్వ్డ్‌ ఇన్స్‌పెక్టర్‌ స్వామి, సంస్థ సభ్యులు విశ్వనాథ్‌ బలరాం, మహిపాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, ఎమ్డీ.ఫయాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T06:26:36+05:30 IST