టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-13T04:52:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని ఇల్లెందు ఎమ్మె ల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌ అన్నారు.

టీఆర్‌ఎ్‌సతోనే అభివృద్ధి: ఎమ్మెల్యే
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందురూరల్‌, జనవరి12: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని ఇల్లెందు ఎమ్మె ల్యే బానోత్‌ హరిప్రియ నాయక్‌ అన్నారు. మంగళవారం ఇల్లెందు మండలం, బాలాజీనగర్‌ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారం భోత్సవాలు నిర్వహించారు. పంచాయతీలోని వైకుంఠధా మం, ఆరోగ్య ఉపకేంద్రం, సీసీ రోడ్లు, ఐసీడీఎస్‌ కార్యాలయంలో టాయిలెట్స్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మన ఊరు మన ప్రణాళిక పథకం ద్వారా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేశారని నేడు గ్రామలన్నీ అభివృద్ధి వైపు పయనిస్తున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, ఎంపీపీ చీమలనాగరత్నమ్మ, వైస్‌ ఎంపీపీ దాస్యం ప్రమోద్‌కుమార్‌, కో-ఆప్షన్‌ సభ్యులు గాజీ, ఉపసర్పంచ్‌ శోభ, పులిగండ్ల మాధవరావు, బానోత్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు. వైస్‌ ఎంపీపీ, ఉపసర్పంచ్‌ల వ్యవ హార శైలితో తాను ఎమ్మెల్యే పర్యట నను బహిష్కరి స్తున్నట్లు సర్పంచ్‌ పాయం స్వాతి ప్రకటించారు. ఎమ్మెల్యే హరిప్రియను కలిసి నిరసన తెలియజేశారు. 


Updated Date - 2021-01-13T04:52:13+05:30 IST