కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN , First Publish Date - 2021-03-21T06:07:48+05:30 IST

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులదేనని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు.

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వసంత

- జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత

 జగిత్యాల టౌన్‌, మార్చి 20 : కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులదేనని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత అన్నారు. శనివారం జడ్పీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష  నిర్వహించారు. అనంతరం వసంత మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. కొవిడ్‌కు సంబధించిన సామగ్రిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కరోనా వ్యాధిని అరికట్టాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా వైధ్యాధికారి శ్రీధర్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుధక్షిణా దేవి, ఆర్‌ఎంవో రామకృష్ణ తదితరులు ఉన్నారు.

 

Updated Date - 2021-03-21T06:07:48+05:30 IST