గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-09-03T06:21:28+05:30 IST

గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ నరేంద్రమోదీ దిష్టిబొమ్మను సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని లేబర్‌ కోర్టుచౌరస్తా వద్ద దహనం చేశారు.

గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి
మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు

- ‘ఖని’లో మోదీ దిష్టిబొమ్మ దహనం

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 2: గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ నరేంద్రమోదీ దిష్టిబొమ్మను సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని లేబర్‌ కోర్టుచౌరస్తా వద్ద దహనం చేశారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం పెంచిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను తగ్గించాలని న్యూడెమోక్రసీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కోడి పుంజుల రాజన్న డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఈదునూరి నరేష్‌, తోక ల రమేష్‌, మల్యాల దుర్గయ్య, కొమురయ్య, బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T06:21:28+05:30 IST