సమాచార శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మృతికి సంతాపం

ABN , First Publish Date - 2021-11-25T22:44:59+05:30 IST

సమాచార, పౌరసంబంధాల శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జె.పవన్ కుమార్ అకస్మిక మృతి పట్ల అ శాఖ అధికారులు , ఉద్యోగులు సంతాపం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు.

సమాచార శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ మృతికి సంతాపం

హైదరాబాద్: సమాచార, పౌరసంబంధాల శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జె.పవన్ కుమార్ అకస్మిక మృతి పట్ల అ శాఖ అధికారులు , ఉద్యోగులు సంతాపం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు. బుధవారం రాత్రి గుండె పోటు తో పవన్ కుమార్ మరణించారు. కాగా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మాసాబ్ ట్యాంక్ లోని ఆ శాఖా కార్యాలయంలో సంతాప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాఖలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు , మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వర్ రావు, జాయింట్ డైరెక్టర్లు డి.ఎస్.జగన్, డి.శ్రీనివాస్ , ఇంచార్జి చీఫ్ ఇన్ ఫర్మేషన్ ఇంజనీర్ రాధాకిషన్, తెలంగాణ మాస పత్రిక ఎడిటర్ ఎ.రాంమోహన్ రావు , డిప్యూటీ డైరెక్టర్లు మధుసూధన్, పాండురంగా రావు, ప్రసాద రావు, అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు.1961 సెప్టెంబర్ 28న నల్గొండ జిల్లాలో జన్మించిన పవన్ కుమార్ మార్చి1982 లో టైపిస్ట్ గా ఉద్యోగ ప్రస్తానాన్ని శాఖలో ప్రారంభించారు. శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ , ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తూ 2019 సెప్టెంబర్ 30న రిటైర్డ్ అయినారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Read more