200 కోసం గొడవ.. దారుణ హత్య

ABN , First Publish Date - 2021-06-15T17:55:26+05:30 IST

రూ. 200ల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో

200 కోసం గొడవ.. దారుణ హత్య

  • బండరాయితో మోది ఒకరి హత్య  


హైదరాబాద్ సిటీ/మియాపూర్‌ : రూ. 200ల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో మాటామాట పెరగడంతో బండరాయితో తలపై మోదడంతో ఒకరు చనిపోయారు. మియాపూర్‌ మార్తాండనగర్‌కు చెందిన డీసీఎం డ్రైవర్‌ ఫరీద్‌ షేక్‌ (46), సమీపంలో ఉన్న ప్రేమ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ మహ్మద్‌ పరిచయస్తులు. తరచూ ఇద్దరు కలిసి మద్యం తాగేవారు. మద్యం మత్తులో గొడవలు పడటం, తిరుగుతూ మద్యం తాగడం వీరికి అలవాటు. సోమవారం సాయంత్రం ఇద్దరూ మద్యం తాగారు. సయ్యద్‌ మహ్మద్‌ గతంలో తనకు రూ. 200 ఇవ్వాల్సి ఉందని, దానికి బాదులుగా బీర్‌ కొనివ్వాలని ఫరీద్‌కు చెప్పాడు. అయితే, తాను డబ్బులు ఇవ్వాల్సి లేదని చెప్పాడు. మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఈ క్రమంలో సయ్యద్‌ మహ్మద్‌ కనిపించిన బండరాయితో ఫరీద్‌ తలపై మోదాడు. తీవ్ర రక్త స్రావమై ఫరీద్‌ అక్కడికక్కడే చనిపోయాడు. మియాపూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more