‘దళితులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’

ABN , First Publish Date - 2021-02-01T06:38:20+05:30 IST

ఉన్నత విద్య అభ్యసిస్తేనే సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దళితులు ఎదగాలని పలువురు వక్తలు తెలిపారు.

‘దళితులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి’

ఖైరతాబాద్‌: ఉన్నత విద్య అభ్యసిస్తేనే సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దళితులు ఎదగాలని పలువురు వక్తలు తెలిపారు. దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ (డిక్కీ) ఆధ్వర్యంలో జలవిహార్‌లో 6వ ప్రబుద్ధ భారత్‌ ఉత్సవం ఆదివారం జరిగింది. డిక్కీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన నర్రా రవికుమార్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో శాంతా బయోటెక్‌ సంస్థ అధిపతి వరప్రసాద్‌దావు, డిక్కీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజా నాయక్‌, ఉపాధ్యక్షుడు రాహుల్‌ కిరణ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు దాసరి అరుణ, దళిత మేధావులు, పారిశ్రామికవేత్తలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-01T06:38:20+05:30 IST