ఓయూ పోలీస్ క్వార్టర్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-12-31T18:20:22+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) సైక్లింగ్ స్టేడియం సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) సైక్లింగ్ స్టేడియం సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఓయూ పరిసర ప్రాంతాల్లో చెత్త ఏరుకునే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహం ఆనవాళ్లను బట్టి ఇరవై రోజుల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.