25 వేల లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు: సీపీ మహేష్ భగవత్

ABN , First Publish Date - 2021-05-21T22:22:09+05:30 IST

మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో..

25 వేల లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు: సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 12వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు 25,537 లాక్ డౌన్ ఉల్లంఘన  కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 1200 సామాజిక దూరం పాటించని వారిపై కేసులు నమోదయ్యాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై 245 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశామన్నారు. నిన్న ఒక్క రోజే 1579 వాహనాలను రాచకొండ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. అలాగే లాక్‌డౌన్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లగించిన 15 వేలు కేసులు నమోదు చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు.

Updated Date - 2021-05-21T22:22:09+05:30 IST