ఇంటికే అయ్యప్ప ప్రసాదం

ABN , First Publish Date - 2021-12-31T19:34:28+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శబరిమలై అయ్యప్ప స్వామి ప్రసాదంను నేరుగా ఇంటికే పంపించేలా తపాలాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఇంటికే అయ్యప్ప ప్రసాదం

గిర్మాజిపేట, డిసెంబరు 30 : దేశంలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  శబరిమలై అయ్యప్ప స్వామి ప్రసాదంను నేరుగా ఇంటికే పంపించేలా తపాలాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రసాదం కోసం  పోస్టాఫీసులో రూ.450 చెల్లిస్తే అరవ ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదంను తపాలా ద్వారి అందిస్తామని వరంగల్‌ డివిజనల్‌ తపాలా సూపరింటెండెంట్‌ ఉమామహేశ్వర్‌ గురువారం తెలిపారు. తపాలాశాఖ కల్పించిన ఈ అవకాశం జనవరి 16 వరకు మాత్రమే  ఉంటుందని, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-12-31T19:34:28+05:30 IST