లిఫ్ట్ దొంగల అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-31T00:29:17+05:30 IST

లిఫ్ట్ పేరుతో దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్

లిఫ్ట్ దొంగల అరెస్ట్

సికింద్రాబాద్: లిఫ్ట్ పేరుతో దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు. లిఫ్ట్ ఇస్తామంటూ దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న కాంచన్‌బాగ్‌కు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశామన్నారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు నార్త్ జోన్ పోలీసులు తెలిపారు.  వారి నుంచి ఒక కారు, 6 సెల్‌ఫోన్లు, 3వేల నగదును స్వాధీనం స్వాధీనం చేసుకున్నాని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.  


Updated Date - 2021-12-31T00:29:17+05:30 IST