మాకు కొవాగ్జిన్‌ వేయించండి

ABN , First Publish Date - 2021-02-06T09:38:58+05:30 IST

ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు కరోనా నుంచి రక్షణ కోసం కొవాగ్జిన్‌ వేయాలని మంత్రి ఈటల

మాకు కొవాగ్జిన్‌ వేయించండి

మంత్రి ఈటలకు రాష్ట్ర అర్చక సమాఖ్య విజ్ఞప్తి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు కరోనా నుంచి రక్షణ కోసం కొవాగ్జిన్‌ వేయాలని మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ అర్చక సమాఖ్య విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రిని ఆ సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మ శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మార్చి నుంచి తెలంగాణలోని పలు దేవాలయాల్లో ఉత్సవాలు, జాతరలు జరగనున్నాయని మంత్రికి వివరించారు. వాటిలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఆలయాల్లో పనిచేసే అర్చక, ఉద్యోగులు వైరస్‌ బారిన పడే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2021-02-06T09:38:58+05:30 IST