ఉప్పరివానికుంటలో టీఎ్‌సఐఐసీ పార్కు రోడ్లు

ABN , First Publish Date - 2022-01-01T04:17:58+05:30 IST

శివానగర్‌లో టీఎ్‌సఐఐసీ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ పార్కులో ఉప్పరివానికుంట ఎఫ్‌టీఎల్‌లో వేసిన రోడ్లను అధికారులు పరిశీలించారు.

ఉప్పరివానికుంటలో టీఎ్‌సఐఐసీ పార్కు రోడ్లు

ఆక్రమణ జరిగిందని నిర్ధారించిన అధికారులు

జిన్నారం, డిసెంబరు 31: శివానగర్‌లో టీఎ్‌సఐఐసీ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ పార్కులో ఉప్పరివానికుంట ఎఫ్‌టీఎల్‌లో వేసిన రోడ్లను అధికారులు పరిశీలించారు. శుక్రవారం జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, ఇరిగేషన్‌ అధికారులు ప్రసాద్‌, టీఎ్‌సఐఐసీ అధికారులు ఉప్పరివానికుంటను పరిశీలించారు. ఎల్‌ఈడీ పార్కు కోసం టీఎ్‌సఐఐసీ భూసేకరణ చేసి రహదారులు వేయగా.. కుంట ఎఫ్‌టీఎల్‌లో రోడ్లు నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రోడ్లు వేశారని నిర్ధారించారు. కాగా అధికారుల అనాలోచిత చర్యలతో కుంట భూమిని ఆక్రమించి, ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని, తిరిగి తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫహిద్‌, కృష్ణ, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T04:17:58+05:30 IST