తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ABN , First Publish Date - 2021-01-13T04:30:55+05:30 IST

తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలోని స్థానిక టెంపుల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను మంగళవారం కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ముగ్గులు వేస్తున్న యువతులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి12: తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలోని స్థానిక టెంపుల్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను మంగళవారం కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ యేట జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో 43 మంది మహిళలు పాల్గొనగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గిరీష్‌, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్శ చంద్రశేఖర్‌, జాగృతి జిల్లా మహిళ కన్వీనర్‌ వినోద, ప్రతినిధులు రవి, దామోదర్‌, లక్ష్మయ్య, మల్లేశ్వరి, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-13T04:30:55+05:30 IST