జిల్లాలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2021-12-26T06:18:24+05:30 IST

జిల్లాలో శనివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపు కున్నారు.

జిల్లాలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు
దైవసందేశాన్ని వినిపిస్తున్న పాస్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 25 : జిల్లాలో శనివారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుపు కున్నారు. గాజులపేట్‌, నిస్సి, శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... ఏసు ప్రభువు దీవెనలతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. స్వార్థఽంవీడి సాటి మను షుల పట్ల ప్రేమ కలిగి జీవించాలని చేసిన బోధనలు ప్రతీఒక్కరూ పాటించాలన్నారు. మానవ జాతికి ఏసు ఆదర్శప్రాయుడని అన్నారు. అన్ని మతాలకు చెందిన పండుగలకు ప్రభుత్వం ప్రాధా న్యతనిచ్చి ప్రోత్సాహకాలు, కానుకలను అందజేస్తుందన్నారు. ప్రభుత్వపరంగా క్రిస్మస్‌ పండుగ జరిపి పేద క్రైస్తవులకు నూతన వస్ర్తాలు అందజేసినట్లు తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పారిశ్రామిక వేత్త మురళీధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నర్మదారెడ్డి, రైతుసంఘ అధ్యక్షుడు ధర్మాజీ రాజేందర్‌, మండల పరిషత్‌ అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డితో పాటు క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకల్లో పాలుపంచుకున్నారు. 

క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తుమార్గాన్ని అనుసరించి జీవితం సుఖమయం చేసుకోవాలన్నారు. 

ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం : మంత్రి అల్లోల

సోన్‌, డిసెంబరు 25 : ఏసుక్రీస్తు జీవితం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్‌ మండలంలోని మాదాపూర్‌ గ్రామంలో గల బేతేలు చర్చిలో శనివారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు జిల్లా నుండే కాకుండా నిజామాబాద్‌, మహరాష్ట్ర నుండి క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేపట్టారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా చర్చిని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, సోన్‌ సర్పంచ్‌ వినోద్‌, సంఘ పెద్ద ఓబద్యా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-26T06:18:24+05:30 IST