రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లు ప్రారం భించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమైన పాయల శంకర్‌ను పట్టణంలోని తన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, మే 20: రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లు ప్రారం భించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు వెళ్లేందుకు సిద్ధమైన పాయల శంకర్‌ను పట్టణంలోని తన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు చేతిలో చిల్లిగవ్వలేని ఈ సమయంలో ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించక పోతే రైతులను నట్టేట ముంచే దళారీ వ్యవస్థకు ఊతమిచినట్టవుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి లేఖ రాశారన్నారు. ఇందులో నాయకులు అంకత్‌ రమేష్‌, జోగు రవి, ఆదినాథ్‌, ఆకుల ప్రవీణ్‌, లోక ప్రవీణ్‌, దయాకర్‌, రాజేశ్‌, శ్రీనివాస్‌, వేదవ్యాస్‌, రైతులు పరమేశ్వర్‌, లకం యాదవ్‌, రామన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST