కరోనా ఎఫెక్ట్.. మరోసారి ఒలింపిక్స్ వాయిదా?

ABN , First Publish Date - 2021-05-05T21:55:24+05:30 IST

ప్రపంచంలోనే అత్యున్నత మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఒలింపిక్స్‌పై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది.

కరోనా ఎఫెక్ట్.. మరోసారి ఒలింపిక్స్ వాయిదా?

ప్రపంచంలోనే అత్యున్నత మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఒలింపిక్స్‌పై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. గతేడాది జపాన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులైలో జపాన్‌లోనే నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ ఏడాది సైతం ఈ టోర్నీకి ముప్పు తప్పేలా లేదు. ప్రస్తుతం జపాన్ నగరాల్లో కోవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కేసులు పెరుగుతుండడంతో జపాన్ ప్రభుత్వం దేశంలో అత్యయిక స్థితిని విధించింది.


క్రీడలకు ఆతిథ్యమిచ్చే టోక్యో, ఒసకా, క్యోటో, హ్యోగో ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మే 11 వరకు అత్యయిక స్థితి విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒలింపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై కొద్ది రోజులుగా జపాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెలలో ఆ విషయంపై ప్రకటన చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వచ్చే నెలకు వాయిదా వేశారు. 

Updated Date - 2021-05-05T21:55:24+05:30 IST