Viral: మెదడు ఆపరేషన్ జరుగుతున్నా మెలకువగా యువతి..! హనుమాన్ చాలీసా పఠనం!

ABN , First Publish Date - 2021-07-24T22:38:14+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఇటీవల ఓ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మెదడులో క్యాన్సర్ కణితిని తొలగించేందుకు వైద్యులు ఓ యువతిని మెలకువగా ఉంచి ఆపరేషన్ నిర్వహించారు.

Viral: మెదడు ఆపరేషన్ జరుగుతున్నా మెలకువగా యువతి..! హనుమాన్ చాలీసా పఠనం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రిలో తాజాగా ఓ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మెదడులో కణితిని తొలగించేందుకు వైద్యులు ఓ యువతిని మెలకువగా ఉంచి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతి నిద్రలోకి జారిపోకుండా ఉండేందుకు హనుమాన్ చాలీసాను పఠించారు. ఆమె 40 శ్లోకాలను చదువుతుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డా. దీపక్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం జులై 23న ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం యువతి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 


‘అవేక్ క్రేనియాటమీ’గా పిలిచే ఈ సంక్లిష్టమైన శాస్త్రచికిత్సలు చేసే సమయంలో పేషెంట్ మెలకువగానే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. రోగి మెలకువగా ఉంటే వైద్యులు పేషెంట్ మెదడులో కీలకమైన భాగాలు దెబ్బతిన్నదీ లేనిదీ వెంటనే గుర్తించి తగు పరిష్కార చర్యలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో పేషెంట్‌కు నొప్పి తెలియకుండా ఉండేందుకు లోకల్ ఎనస్థీషియాతో పాటూ మరికొన్ని రకాల ఔషధాలు ఇచ్చి ఈ ఆపరేషన్ చేస్తారు.   Updated Date - 2021-07-24T22:38:14+05:30 IST