రోడ్డుపై గుంతలో నీళ్లతో వ్యక్తి స్నానం.. బాగు చేస్తామన్న ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-03-24T11:27:26+05:30 IST

రోడ్డుపై ఏర్పడిన ఒక గుంతలో భారీగా నీళ్లు చేరాయి. ఎంతలా అంటే ఒక వ్యక్తి వాటిలో దిగి ఎంచక్కా స్నానం చేసేంతలా. అతను చేసిన ఈ పనిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

రోడ్డుపై గుంతలో నీళ్లతో వ్యక్తి స్నానం.. బాగు చేస్తామన్న ప్రభుత్వం!

ఇండోనేషియా: రోడ్డుపై ఏర్పడిన ఒక గుంతలో భారీగా నీళ్లు చేరాయి. ఎంతలా అంటే ఒక వ్యక్తి వాటిలో దిగి ఎంచక్కా స్నానం చేసేంతలా. అతను చేసిన ఈ పనిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలో ఒక రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దానిలో నీళ్లు నిలిచి అదో పెద్ద మడుగులా తయారైంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టాలని అనుకున్న ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ఆ నీటి మడుగులో చేపలు పడుతూ, స్నానం చేస్తూ కనిపించాడు.


అతని ప్రవర్తన చేసిన కొందరు ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన ప్రభుత్వ అధికారులు షాకయ్యారు. వెంటనే రంగంలోకి దిగి సదరు గుంతను పూడ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఎన్‌టీబీ ప్రావిన్స్‌కు చెందిన పబ్లిక్ వర్క్స్ అండ్ స్పేషియల్ ప్లానింగ్ సేవల అధికారి మాట్లాడుతూ.. తాము త్వరలోనే ఆ రోడ్డును బాగు చేస్తామని చెప్పారు.

Updated Date - 2021-03-24T11:27:26+05:30 IST