రోడ్డుపై సీఎం చేసిన పనికి షాకైన ప్రజలు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్..

ABN , First Publish Date - 2021-10-26T15:15:26+05:30 IST

ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో పాల్గొనేందకు వెళ్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారులోంచి కిందకు దిగారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పనికి అక్కడున్న ప్రజలు షాకయ్యారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన దృశ్యా

రోడ్డుపై సీఎం చేసిన పనికి షాకైన ప్రజలు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్..

ఇంటర్నెట్ డెస్క్: ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలో పాల్గొనేందకు వెళ్తూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన కారులోంచి కిందకు దిగారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పనికి అక్కడున్న ప్రజలు షాకయ్యారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్ సీఎం‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గత నెలలో భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా స్థానాల్లో ఎన్నికల సందడి మొదలైంది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయా ప్రాంతాల్లో విస్త్రృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్నికల ప్రచార సభకు వెళ్లేందుకు తన కాన్వాయ్‌లో బయల్దేరిన చౌహాన్.. 50 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయన కారులోంచి కిందకు దిగి.. ఫోన్ ద్వారా వర్చువల్‌గా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా కారులోంచి బయటకు వచ్చి.. ఎన్నికల ప్రచార సభలో ఫోన్ ద్వారా ప్రసంగిస్తున్న సీఎం‌ను చూసి అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఫోన్ ద్వారానే ప్రసంగం ముగించిన ఆయన.. ఆ తర్వాత అక్కడున్న ప్రజలతో సెల్ఫీ దిగారు. 




Updated Date - 2021-10-26T15:15:26+05:30 IST