రాత్రి వేళ బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు.. 10నిమిషాల తర్వాత విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్..

ABN , First Publish Date - 2021-11-28T23:48:38+05:30 IST

అదో ప్రవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు. ప్రయాణికులతో ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో రాత్రి వేళ.. బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది.

రాత్రి వేళ బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు.. 10నిమిషాల తర్వాత విషయం తెలుసుకుని ప్రయాణికులు షాక్..

ఇంటర్నెట్ డెస్క్: అదో ప్రవేటు ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు. ప్రయాణికులతో ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే మార్గమధ్యలో రాత్రి వేళ.. బస్సులో అకస్మాత్తుగా వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకు శబ్దాలకు గల కారణం ఏంటో తెలసుకుని షాక్ అయ్యారు. కాగా..  ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..కొందరు ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఉదయ్‌పూర్ నుంచి ముంబైకి బయల్దేరింది. ఈ క్రమంలోనే ఆ బస్సు శనివారం అహ్మాదాబాద్ పరిసర ప్రాంతానికి చేరుకుంది. రాత్రి సమయం కావడంతో రోడ్డు పక్కన ఉన్న దాబా వద్ద డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో ప్రయాణికులు దాబాలో భోజనం చేసి, తిరిగి బస్సెక్కారు. ఈ నేపథ్యంలో బస్సు కొద్ది దూరం వెళ్లిన తర్వాత.. వింత శబ్దాలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. ఆ తర్వాత 10 నిమిషాలకే బస్సులో 14 అడుగుల కొండ చిలువ కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. చాకచక్యంగా ఆ కొండ చిలువను పట్టుకుని దాన్ని అడవిలో విడిచిపెట్టారు. దీంతో మిగిలిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
Read more