విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ముఖానికి ఫేస్ మాస్క్‌కు బదులు అండర్‌వేర్.. ఇదేంటని అడిగితే..

ABN , First Publish Date - 2021-12-17T17:22:52+05:30 IST

విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన రచ్చకు విసిగెత్తిపోయిన సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దింపేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ముఖానికి ఫేస్ మాస్క్‌కు బదులు అండర్‌వేర్.. ఇదేంటని అడిగితే..

ఫ్లోరిడా: విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన రచ్చకు విసిగెత్తిపోయిన సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దింపేసిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. దీంతో ఇప్పుడీ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాకు చెందిన ఆడం జెన్నె అనే వ్యక్తి వాషింగ్టన్ డీసీ వెళ్లేందుకు ఫోర్ట్ లాడర్‌డేల్ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కాడు. విమానం ఎక్కిన తర్వాత సిబ్బంది ప్రయాణికులందరినీ ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపారు. దాంతో విమానంలోని ప్రయాణికులందరూ మాస్కులు ధరించారు. ఈ క్రమంలో ఆడం ముఖానికి ఫేస్ మాస్కుకు బదులు అండర్‌వేర్ వేసుకున్నాడు. అది గమనించిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 


వారి ఫిర్యాదుతో వెంటనే ఆడం వద్దకు వచ్చిన సిబ్బంది ముఖానికి ధరించిన అండర్‌వేర్‌ను తీసేసి మాస్కు వేసుకోవాలని కోరారు. అందుకు ఆడం ససేమీరా అన్నాడు. పైగా తాను ఇప్పటి వరకు డజన్ల విమానాల్లో ఇలాగే ప్రయాణం చేశానని, వారు ఎవ్వరు అభ్యంతరం చెప్పలేదని చెప్పుకొచ్చాడు. దేశంలో చాలా విషయాలు మారుతున్నాయి. ఇది అంతే. దీనికే ఇంతలా రచ్చ చేయాలా? మీ పని మీరు చూసుకోండి అన్నట్టు మాట్లాడాడు ఆడం. దాంతో చాలా సేపటి వరకు ఆడంను సముదాయించే ప్రయత్నం చేసింది సిబ్బంది. కానీ, ఆడం వారి మాటలను పట్టించుకోలేదు. దాంతో చేసేదేమిలేక అతడ్ని విమానం నుంచి కిందకు దించేశారు. ఇప్పుడీ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. Read more