ముచ్చటపడి కొత్త సోఫాను ఆర్డర్ చేసిన వ్యక్తి.. ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఏం ఉందో చూసి షాక్..

ABN , First Publish Date - 2021-12-09T01:24:16+05:30 IST

ఓ వ్యక్తి ఎంతో ముచ్చటపడి.. కొత్త సోఫాను ఆర్డర్ చేశాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సోఫాను హాల్‌లో సర్దుతుండగా.. అందులోంచి వింత శబ్దాలు రావడాన్ని అతడు గమనించాడు. ఈ క్రమంలో సోఫాను క్షుణ్ణంగా పరి

ముచ్చటపడి కొత్త సోఫాను ఆర్డర్ చేసిన వ్యక్తి.. ఇంటికి వచ్చిన తర్వాత అందులో ఏం ఉందో చూసి షాక్..

ఎన్నారై డెస్క్: ఓ వ్యక్తి ఎంతో ముచ్చటపడి.. కొత్త సోఫాను ఆర్డర్ చేశాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన సోఫాను హాల్‌లో సర్దుతుండగా.. అందులోంచి వింత శబ్దాలు రావడాన్ని అతడు గమనించాడు. ఈ క్రమంలో సోఫాను క్షుణ్ణంగా పరిశీలించాడు. అనంతరం అందులో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..


ఫ్లోరిడాలోని క్లియర్‌వాటర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా సోఫాను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన మరుసటి రోజు అతడి ఇంటికి సోఫా వచ్చింది. దీంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన సోఫాను హాల్లో సర్దడం ప్రారంభించాడు. ఇంతలో అతడికి వింత శబ్దాలు వినిపించాయి. సోఫా నుంచే ఆ  శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి.. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఈ నేపథ్యంలో అందులో 5 అడుగుల భారీ సర్పాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే ఈ సమాచారం పోలీసులకు చేర వేశాడు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోఫాను బహిరంగ ప్రదేశంలోకి తీసుకొచ్చి.. అందులో ఉన్న పామును చాకచక్యంగా బంధించారు. దీంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. సోఫాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే.. పాము దానిలో దూరి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆ భారీ సర్పాన్ని స్థానికంగా ఉన్న పెట్ సెంటర్‌కు తరలించనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ సర్పంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అధికారులు.. జరిగిన ఘటన గురించి వివరించారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది. 


Read more