ఐ క్రీమ్‌ వాడుతున్నారా!

ABN , First Publish Date - 2021-04-25T05:30:00+05:30 IST

కళ్లను ఎంత బాగా సింగారించుకుంటే అంత చూడముచ్చటగా కనిపిస్తాం. అయితే కళ్ల కింద క్రీమ్‌ రాసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది చాలా సున్నితమైన ప్రదేశం

ఐ క్రీమ్‌ వాడుతున్నారా!

కళ్లను ఎంత బాగా సింగారించుకుంటే అంత చూడముచ్చటగా కనిపిస్తాం. అయితే కళ్ల కింద క్రీమ్‌ రాసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అది చాలా సున్నితమైన ప్రదేశం. అక్కడ దుమ్ము, ధూళి, ఫ్రీ రాడికల్స్‌ చేరే అవకాశం ఎక్కువ. 


  1. పలచగా ఉండే కళ్ల కింది చర్మానికి పోషణ, తేమ అందాలంటే సరైన ఉత్పత్తులను వాడాలి. కొద్దిగా ఐ క్రీమ్‌ను తీసుకొని కింది కనురెప్పల దిగువన రాసుకోవాలి. 
  2. అలాగే క్లీన్సింగ్‌, టోనింగ్‌ తరువాత అండర్‌ ఐ క్రీమ్‌ రాసుకునే ముందు సీరమ్‌ లేదా మాయిశ్చరైజర్‌ అప్లై చేయడం మరచిపోవద్దు. తేలికైన వాటిని ముందుగా రాసుకోవడం మంచిది. 
  3. ఐ క్రీమ్స్‌ను చర్మం తొందరగా గ్రహిస్తుంది. చాలా ఐ క్రీమ్స్‌లో విటమిన్‌ సి, రెటినాల్‌ ఉంటుంది. తరచుగా ఐ క్రీమ్‌ రాసుకునే అలవాటు ఉన్నవారు విటమిన్‌ సి ఉన్నది ఎంచుకోవాలి.

Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST