కురుల సంరక్షణ ఇలా..!

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

జుట్టు పొడిబారడం, చివర్లు పగలడం, జుట్టు రాలిపోవడం... ఇవన్నీ శిరోజాల సమస్యను సూచించేవే. వీటిని నిర్లక్ష్యం చేస్తే కుదుళ్లు బలహీనపడి కురులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో కేశాలను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...

  1. జుట్టు దెబ్బతింటోంది అంటే సరైన పోషణ లేదని అర్థం. కురులకు గుడ్డు పచ్చసొనను పట్టిస్తే ఇది కండిషనర్‌గానూ, మాయిశ్చర్‌గానూ పనిచేస్తుంది. గుడ్డు పచ్చసొనను జుట్టుకు పట్టించాక గంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. 
  2. పొడిబారిన జుట్టు తిరిగి మెత్తగా, పట్టులా మారాలంటే గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌ను పట్టించాలి. 45 నిమిషాల తరువాత షాంపూతో కడిగేయాలి. 
  3. శిరోజాల చివర పగుళ్లు ఉన్నట్లయితే వెన్నతో మసాజ్‌ చేసుకోవాలి. తరువాత షవర్‌ క్యాప్‌తో శిరోజాలను కవర్‌ చేసుకోవాలి. అరగంట తరువాత షాంపూతో స్నానం చేయాలి. 
  4. పొడిబారిన జుట్ట సహజసిద్దమైన మెరుపును సొంతం చేసుకోవాలంటే బ్లాక్‌టీని జుట్టుకు పట్టించాలి.  
  5. అరటిపండు, బాదం నూనె హెయిర్‌ప్యాక్‌ కురులను మృదువుగా చేస్తుంది. 
  6. తేనెలో కొంచెం నీరు కలిపి జట్టుకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
  7. టీస్పూన్‌ చొప్పున యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, టీస్పూన్‌ తేనె, అరకప్పు పెరుగు మిశ్రమం శిరోజాలు ఆరోగ్యంగా, పట్టులా మారుస్తుంది. 

Read more