అందుకే అది అంతిమ దివ్య గ్రంథం

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

నవులను సృష్టించిన దేవుడు ఆ మానవులు ఈ భూమిమీద ఎలా జీవించాలో, ఎలా నడచుకోవాలో బోధించడం కోసం ప్రవక్తలకు గ్రంథాలను ప్రసాదించాడు.

అందుకే అది అంతిమ దివ్య గ్రంథం

నవులను సృష్టించిన దేవుడు ఆ మానవులు ఈ భూమిమీద ఎలా జీవించాలో, ఎలా నడచుకోవాలో బోధించడం కోసం ప్రవక్తలకు గ్రంథాలను ప్రసాదించాడు. చిట్టచివరి ప్రవక్త అయిన మహమ్మద్‌ ద్వారా అవతరించిన పవిత్ర గ్రంథమే ‘దివ్య ఖుర్‌ఆన్‌’. ఈ గ్రంథాన్ని తన దాసుడైన మహమ్మద్‌ ప్రవక్తకు దైవదూతల నాయకుడైన జిబ్రీల్‌ ద్వారా అల్లాహ్‌ అందించాడు. అది దైవం మానవాళికి ప్రసాదించిన చివరి గ్రంథం. అందుకే అది ‘అంతిమ దివ్య గ్రంథం’గా వాసికెక్కింది. దివ్యఖుర్‌ఆన్‌ ఆవిర్భవించినప్పటి నుంచి... దానిలో నేటి వరకూ ఒక్క వాక్యం లేదా ఒక్క పదం మార్పునకు లోనుకాలేదు. ఎలాంటి సందేహానికీ ఆస్కారం లేని దైవదత్తమైన ఈ గ్రంథం భయభక్తులు కలిగినవారికి సన్మార్గం చూపిస్తుంది.


 ‘‘వారు అగోచరాలు, అతీంద్రియాలను విశ్వసిస్తారు. ప్రార్థన వ్యవస్థను స్థాపిస్తారు. మేము ప్రసాదించిన సంపద నుంచి ఖర్చు చేస్తారు. నీద్వారా (ప్రవక్త ద్వారా) అవతరించిన గ్రంథాన్నీ, నీకు పూర్వం ఉన్న ప్రవక్తల ద్వారా అవతరించిన గ్రంథాలను, పరలోకాన్నీ విశ్వసిస్తారు. అలాంటి దైవభీతిపరులే తమ సృష్టికర్త చూపించిన మార్గంలో నడిచేవారు. అలాంటివారే సాఫల్యం చెందుతారు. మోక్షం పొందుతారు’’ అని దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST