‘కిలిం’ కల్లోలం!

ABN , First Publish Date - 2021-04-11T05:25:59+05:30 IST

ఫ్లోరల్‌ ప్రింట్లు సమ్మర్‌ స్పెషల్‌. కానీ ప్రతి వేసవిలో ఇదే స్టైల్‌ అనుసరిస్తే మజా ఏం ఉంటుంది? అందుకే ఫ్లోరల్‌, ఇక్కత్‌, షింజ్‌ ప్రింట్లకు బదులుగా సరికొత్త ‘కిలిం’ ప్రింట్ల మీద మనసు పారేసుకుంటున్నారు సెలబ్రిటీలు

‘కిలిం’ కల్లోలం!

ఫ్లోరల్‌ ప్రింట్లు సమ్మర్‌ స్పెషల్‌. కానీ ప్రతి వేసవిలో ఇదే స్టైల్‌ అనుసరిస్తే మజా ఏం ఉంటుంది? అందుకే ఫ్లోరల్‌, ఇక్కత్‌, షింజ్‌ ప్రింట్లకు బదులుగా సరికొత్త ‘కిలిం’ ప్రింట్ల మీద మనసు పారేసుకుంటున్నారు సెలబ్రిటీలు. కార్పెట్‌ ప్రింట్‌గా పేరున్న కిలిం ప్రింట్లకు బొహిమియన్‌ లుక్‌ అద్ది అలరిస్తున్నారు.


మధ్యప్రాచ్య దేశాలకు పరిమితమై, కలకాలం ఆదరణకు నోచుకున్న కిలిం ప్రింట్లు విభిన్నంగా ఉంటాయి. వీటికి సమకాలీన లుక్‌ను జోడించి, డిజైన్‌ చేసి ధరిస్తే మోడర్న్‌గా కనిపించవచ్చు. ఈ ఆలోచనతోనే కేవలం ఖాళీ సమయాల్లో ఇంటి పట్టున ఉన్నప్పుడు ధరించే దుస్తులకే పరిమితమైన కిలిం ప్రింట్‌ను... సెలబ్రిటీలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు జూమ్‌ మీటింగ్స్‌, క్వారంటైన పార్టీల్లో ధరించడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన ఈ రకం ఫ్యాషన్‌ తక్కువ కాలంలోనే ఫేమస్‌ అయిపోయింది.


అటు వెస్టర్న్‌, ఇంటు ఇండియన్‌ రెండు రకాల దుస్తుల డిజైనింగ్‌కు నప్పే గుణం ఉండడంతో, ఇవి వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటి అందం మరింత ఇనుమడించాలంటే, వీటితో పాటు వింటేజ్‌ ఆక్సిడైజ్‌ జ్యువెలరీ ధరించాలి. అత్యద్భుతమైన మధ్యప్రాచ్య దేశాల్లోని మినార్లు, రహస్య ఒట్టొమన్‌ హన్స్‌ సామ్రాజ్యాలు, తేయాకు తోటలు... ఇలా కళ్లు చెదిరే డిజైన్లలో తయారయ్యే కిలిం ప్రింట్ల దుస్తుల్లో బాలీవుడ్‌ తారలు సంజనా సంఘి, ఆదితీరావ్‌ హైదరీ, రవీనా టాండన్‌లు మెరుపులు మెరిపిస్తున్నారు.

Read more