పుదీనా టీతో అవాంఛిత రోమాలు కట్‌!

ABN , First Publish Date - 2021-03-29T06:23:31+05:30 IST

చాలామంది ముఖంపై, పెదవుల పైభాగంలో అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే వీటిని పోగొట్టడంలో పుదీనా టీ బాగా పనిచేస్తుంది..

పుదీనా టీతో అవాంఛిత రోమాలు కట్‌!

చాలామంది ముఖంపై, పెదవుల పైభాగంలో అవాంఛిత రోమాలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే వీటిని పోగొట్టడంలో పుదీనా టీ బాగా పనిచేస్తుంది.  


తయారీ: ఒక కప్పు నీళ్లను తీసుకుని మరగపెట్టి అందులో ఐదు పుదీనా ఆకులు వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఆ నీళ్లను వడగట్టి పది నిమిషాల తర్వాత తాగాలి. ఇలా రోజులో రెండుసార్లు చేస్తే అవాంఛిత రోమాలు రావు. ఒక టేబుల్‌స్పూను నిమ్మరసంలో నాలుగు టేబుల్‌స్పూన్ల తేనె కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్ల చొప్పున కొద్ది నెలలపాటు చేస్తే కూడా అవాంఛితరోమాల సమస్య తలెత్తదు.  

Read more