చర్మ సంరక్షణ కోసం...

ABN , First Publish Date - 2021-04-11T05:30:00+05:30 IST

ముఖారవిందాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చర్మానికి తగిన పోషణ లభించేలా చూసుకోవడంతో పాటు, ఎప్పుడూ తగిన మాయిశ్చర్‌ ఉండేలా చూసుకోవాలి. అలాంటి బ్యూటీ టిప్స్‌ ఇవి...

చర్మ సంరక్షణ కోసం...

ముఖారవిందాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. చర్మానికి తగిన పోషణ లభించేలా చూసుకోవడంతో పాటు, ఎప్పుడూ తగిన మాయిశ్చర్‌ ఉండేలా చూసుకోవాలి. అలాంటి బ్యూటీ టిప్స్‌ ఇవి...

  • మేక్‌పను తొలగించడానికి ఆయిల్‌ బేస్డ్‌ క్లెన్సర్‌ లేక కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇది మేక్‌పను తొలగించడమే కాకుండా చర్మంపై న్యాచురల్‌ ఆయిల్‌ తగినంత ఉండేలా చేస్తుంది.
  • చర్మం ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా తేనె కాపాడుతుంది. రెండు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌లో రెండు టేబుల్‌స్పూన్ల తేనె కలుపుకుని ముఖానికి రాసుకుంటే మొటిమలు దరిచేరకుండా ఉంటాయి. 
  • క్రీమ్‌ బేస్ట్‌ స్క్రబ్‌కు బదులుగా ఆలివ్‌ ఆయిల్‌తో ముఖాన్ని ఒక నిమిషం పాటు మర్దన చేసి తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
  • అలొవెరా ఉన్న మాయిశ్చరైజర్‌ వాడటం ఉత్తమం. అలొవెరాలో బోలెడు ఔషధ గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి కావలసిన న్యాచురల్‌ ఆయిల్స్‌ను అందిస్తాయి. 
  • కోడిగుడ్డు పచ్చసొన తీసుకుని అందులో ఒక టీస్పూన్‌ ఆరెంజ్‌ జ్యూస్‌, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, కొంచెం రోజ్‌వాటర్‌, కొన్నిచుక్కల లెమన్‌జ్యూస్‌ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ మాస్క్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖారవిందం రెట్టింపవుతుంది. 
  • పగటి వేళ ముఖానికి మాయిశ్చర్‌ గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో, రాత్రివేళ కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. రాత్రివేళ సహజంగానే చర్మం మరమ్మతులు చేసుకుంటుంది. మాయిశ్చరైజింగ్‌ ఈ ప్రక్రియకు మరింత తోడ్పాటునందిస్తుంది. అంతేకాకుండా క్రమంతప్పకుండా మాయిశ్చరైజింగ్‌ చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
  • అరటిపండును గుజ్జుగా చేసి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినకుండ ఉంటుంది. 

Read more