బాలీవుడ్‌కు పెళ్లికళ
ABN , First Publish Date - 2021-12-19T05:30:00+05:30 IST
బాలీవుడ్‌కి పెళ్లి కళ వచ్చింది. ఈ ఏడాది హిందీ చిత్రసీమకు చెందిన ప్రేమజంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి....
బాలీవుడ్‌కి పెళ్లి కళ వచ్చింది. ఈ ఏడాది హిందీ చిత్రసీమకు చెందిన ప్రేమజంటలు వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఎన్నో ఏళ్ల డేటింగ్‌కు ముగింపు పలుకుతూ మనసుకు నచ్చిన వ్యక్తులను మనువాడి మురిసిపోయారు. పలువురు సినీతారలు తమ వివాహ విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 24న అలీబాగ్‌లో ఈ ప్రేమజంట ఒకటయింది.
హీరోయిన్ దియామీర్జా వ్యాపారవేత్త వైభా రేఖీని పెళ్లాడారు. ఫిబ్రవరి 15న సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది.
ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో తెలుగు వారికి దగ్గరయిన జర్మన్ బ్యూటీ ఎవ్లిన్ శర్మ. ఆమె వివాహం ఆస్ట్రేలియాకి చెందిన డెంటల్ సర్జన్ తుషాన్ బిందీతో మే 15న బ్రిస్బేన్‌లో గ్రాండ్‌గా జరిగింది.
‘నువ్విలా’, ‘గౌరవం’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ యామీ గౌతమ్. సినీ రచయిత, దర్శకుడు ఆదిత్యధర్‌తో జూన్ 4న ఆమె వివాహం జరిగింది.
సోనమ్ కపూర్ సోదరి, నిర్మాత రియా కపూర్ వివాహం నిర్మాత కరణ్ బూలానీతో జరిగింది. ఆగస్టు 14న ముంబై జుహూ బంగ్లాలో వీరి వివాహం జరిగింది.
కథానాయిక అనుష్క రంజన్ సహ నటుడు ఆదిత్యసీల్‌ను వివాహమాడారు. నవంబరు 21న ముంబైలో వీరి వివాహం ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
బాలీవుడ్ ప్రేమజంట రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. నవంబరు 15న చండీఘర్‌లో ఈ ప్రేమజంట ఒక్కటయింది.
ఎక్కడా తమ లవ్ ఎఫైర్‌ను బహిరంగంగా వెల్లడించని విక్కీ కౌశల్, కట్రీనా కైఫ్ డిసెంబర్‌లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని రాజప్రాసాదంలో సంప్రదాయరీతిలో జరిగిన తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.