అగ్ని-పి క్షిపణి పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2021-12-19T07:50:14+05:30 IST

అగ్ని క్షిపణుల్లో అత్యాధునికమైన అగ్ని ప్రైమ్‌(అగ్ని-పి) క్షిపణిని భారత్‌ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ...

అగ్ని-పి  క్షిపణి పరీక్ష విజయవంతం

అణ్వాయుధ సామర్థ్యం 

కలిగిన బాలిస్టిక్‌ క్షిపణి

ఒడిశాలో పరిశీలన

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ హర్షం

అత్యాధునిక అగ్ని-పి క్షిపణి 

పరీక్ష విజయవంతం


న్యూఢిల్లీ, డిసెంబరు 18: అగ్ని క్షిపణుల్లో అత్యాధునికమైన అగ్ని ప్రైమ్‌(అగ్ని-పి) క్షిపణిని భారత్‌ శనివారం విజయవంతంగా ప్రయోగించింది. అణు సామర్థ్యం కలిగిన ఈ బాలిస్టిక్‌ క్షిపణిని ఒడిశాలోని డా. ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) పరీక్షించింది. దీనిలో అనేక సరికొత్త అదనపు సామర్థ్యాలున్నాయని, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ అత్యంత కచ్చితత్వంతో క్షిపణి చేరుకుందని సంస్థ అధికారులు తెలిపారు. ఈ క్షిపణిని ఈ ఏడాది జూన్‌ 28న తొలిసారి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దాదాపు పూర్తిస్థాయిలో క్షిపణి సిద్ధమైన నేపథ్యంలో.. త్వరలోనే బలగాల సేవలకు మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్నవారికి అభినందనలు తెలిపారు. అగ్ని క్లాస్‌ క్షిపణుల్లో అగ్ని-పి అనేది కొత్త తరం అత్యాధునిక క్షిపణి. రైలు నుంచైనా, రహదారి నుంచైనా దీన్ని ప్రయోగించవచ్చు. అవసరాన్ని బట్టి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా పెట్టెల్లో పెట్టి వీటిని తరలించవచ్చు. దీని పరిధి 1000 నుంచి 200

Updated Date - 2021-12-19T07:50:14+05:30 IST