పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసాకు కొవిడ్

ABN , First Publish Date - 2021-01-12T12:21:00+05:30 IST

పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసాకు కొవిడ్ -19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది....

పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసాకు కొవిడ్

బ్లూమ్‌బెర్గ్ (పోర్చుగీస్): పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసాకు కొవిడ్ -19  పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. రెబెలో డి సౌసాకు కరోనా సోకినా వైరస్ లక్షణాలు మాత్రం లేవు. కరోనా సోకిన 72 ఏళ్ల రెబెలో డి సౌసా స్వీయ నిర్బంధంలో  ఉన్నారు. డిసౌసాకు సోమవారం జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని వచ్చింది. అనంతరం యాంటీబాడీ టెస్టులోనూ ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. అయితే పీసీఆర్ టెస్టులో మాత్రం డి సౌసాకు కరోనా పాజిటివ్ అని తేలిందని అధ్యక్షుడి వెబ్ సైట్ తెలిపింది.కరోనా సోకడంతో అధ్యక్షుడు రెబెలో కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. పోర్చుగల్ దేశంలో జనవరి 24వతేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో  డి సౌసాకు కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లారు. 

Updated Date - 2021-01-12T12:21:00+05:30 IST