చర్చకు భయమెందుకు? పెగాసస్‌పై ఓవైసీ

ABN , First Publish Date - 2021-08-01T22:46:27+05:30 IST

పెగాసస్‌పై చర్చ చేయాలని అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం దీనిపై చర్చకు అంగీకరించట్లేదు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అసలు ఏం దాస్తున్నారు? ఇంకా ఏం దాచాలనుకుంటున్నారు?

చర్చకు భయమెందుకు? పెగాసస్‌పై ఓవైసీ

న్యూఢిల్లీ: పెగాసస్‌పై మాట్లాడేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పెగాసస్‌పై వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేము పార్లమెంట్‌ నడవాలని అనుకుంటున్నాము. కానీ ప్రభుత్వానికి అది ఇష్టం లేదు. కేవలం బిల్లులు ఆమోదింపజేసుకోవడానికే వాళ్లకు పార్లమెంట్ కొనసాగాలి. అలాగే నడుస్తోంది కూడా. ఇది ప్రజాస్వామ్యమా? మా అభిప్రాయాలను చెప్పడానికి మాకు కనీసం అవకాశం లభించడం లేదు’’ అని ఓవైసీ అన్నారు.


ఇక పెగాసస్‌పై మాట్లాడుతూ ‘‘పెగాసస్‌పై చర్చ చేయాలని అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కానీ ప్రభుత్వం దీనిపై చర్చకు అంగీకరించట్లేదు. ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అసలు ఏం దాస్తున్నారు? ఇంకా ఏం దాచాలనుకుంటున్నారు?’’ అని ఓవైసీ అన్నారు.

Read more