మరో కొత్త పథకాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2021-02-01T17:07:47+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన’ అన్న

మరో కొత్త పథకాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన’ అన్న పేరుతో కొత్త పథకాన్ని ఆమె సభలో ప్రకటించారు. ఈ పథకం కింద 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా ఆరోగ్యంపై బడ్జెట్‌ను పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్‌ సూచించిన కార్యక్రమాలను కూడా అమలు చేస్తామని ప్రకటించారు.. కొత్తగా తొమ్మిది బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగ శాలలతో పాటు 15 అత్యవసర కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-01T17:07:47+05:30 IST